బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: దాసోజు శ్రవణ్

- March 15, 2023 , by Maagulf
బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: దాసోజు శ్రవణ్

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకైందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘బండి సంజయ్ నేతృత్వంలోనే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ జరిగింది.

పేపర్ లీక్ సూత్రధారి రాజశేఖర్ బండి సంజయ్, బీజేపీ ఫాలోవర్. కుట్రపూరితంగా టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ చేసి ప్రభుత్వాన్ని బదునామ్ చేయాలనుకున్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. బీజేపీ సోషల్ మీడియా కార్యకర్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉండి పేపర్ లీకేజీకి పాల్పడ్డారు. బీజేపీ చేసిన రాజకీయ కుట్ర వల్ల లక్షల మంది యువత భవిష్యత్ అగమవుతోంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

రాజశేఖర్ బీజేపీలో సోషల్ మీడియాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అతడు బండి సంజయ్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు వాళ్లకు వాళ్లే ఆరోపణలు చేసుకోని బీజేపీ గ్రాఫ్ పడగొట్టుకున్నారు’’ అని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com