‘బలగం’తో దిల్ రాజు గట్టెక్కేశారుగా.!
- March 15, 2023
ఈ మధ్య దిల్ రాజుకు ఏది పట్టినా మట్టయిపోతోంది.పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేదు.. నష్టాల బాటలో నడుస్తోంది దిల్ రాజు యాపారం.
ఇటీవల ‘వారసుడు’ రూపంలో చాలా చాలా దెబ్బయిపోయాడు దిల్ రాజు. ఈ సినిమాతో చాలా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఫలించలేదు. అయితే, అనుకోకుండా దిల్ రాజు గట్టెక్కేశాడు ఓ చిన్న సినిమాతో.
అదే ‘బలగం’. కమెడియన్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ వీక్ ఓకే అనిపించుకున్నా సెకండ్ వీక్ కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడగలిగింది.
దాంతో, ఈ సినిమాపై దిల్ రాజు పెట్టిన పెట్టుబడి వచ్చేయగా.. లాభాల బాట పట్టింది. దాంతో రాజుగారు కాస్త హ్యాపీ ఫీలవుతున్నారు.
ప్రియదర్శి హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రియదర్శికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది హీరోగా. తొలి సినిమా ‘మల్లేశం’తో ఆల్రెడీ హీరోగా తన స్టామినా చాటిన ప్రియదర్శికి ‘బలగం’ రూపంలో ఆ సక్సెస్ కంటిన్యూ అయ్యిందనే చెప్పొచ్చు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!