ఆస్కార్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీయార్ ఎమోషనల్ రెస్పాన్స్.!
- March 15, 2023
ఆస్కార్ సాధించడం చాలా ఆనందంగా వుందన్నాడు. బాధ్యత గల భారాన్ని చాలా బాధ్యతగా మోయాల్సి వచ్చింది. కోట్లాది మంది సినీ అభిమానుల ఆశల్ని మోసుకెళ్లాం.. అని అమెరికా నుంచి తిరిగొచ్చిన ఎన్టీయార్, అభిమానులనుద్దేశించి తన మనసులోని మాటల్ని వెల్లడించాడు.
ఆస్కార్ కోసం అమెరికా వెళ్లిన ఎన్టీయార్ హైద్రాబాద్‌కి తిరిగొచ్చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీయార్‌కి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆస్కార్ గెలుచుకున్న ఆనందాన్ని పై విధంగా తెలియచేశాడు ఎన్టీయార్.
ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా ‘నాటు నాటు..’ సాంగ్ ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ‘నాటు నాటు..’ పాటతో తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపితమైంది అంతర్జాతీయ వేదికలపై.
రాజమౌళి, ఎన్టీయార్, రామ్ చరణ్.. ఆస్కార్ కోసం పడిన కష్టం ఎట్టకేలకు ఫలించింది. తెలుగు సినిమా గొప్పతనం నిలబడింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







