TCS కొత్త సీఈఓగా కె.కృతివాసన్!

- March 16, 2023 , by Maagulf
TCS కొత్త సీఈఓగా కె.కృతివాసన్!

న్యూఢిల్లీ: భారత్ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ తన పదవికి రాజీనామా సమర్పించినట్టు కంపెనీ తెలిపింది.

ఆయన స్థానంలో కె కృతివాసన్ సంస్థ సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపడతారని కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. రాజేష్ గోపీనాథన్ సెప్టెంబర్ వరకు కంపెనీలోనే కొనసాగనున్నారు. వాటాదారుల ఆమోదానికి లోబడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయన తన బాధ్యతలను స్వీకరిస్తారు.

గురువారం(మార్చి 16) నుంచి కృతివాసన్ సీఈఓ డిజిగ్నేట్‌గా వ్యవహరిస్తారని కంపెనీ తెలిపింది. కె కృతివాసన్ ప్రస్తుతం టీసీఎస్‌లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) వ్యాపార విభాగానికి అధ్యక్షుడు, గ్లోబల్ హెడ్‌గా ఉన్నారు. 1989లో కంపెనీలో చేరిన కృతివాసన్ 34 ఏళ్లుగా కంపెనీలో భాగస్వామ్యం కలిగిన ఆయన కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, లార్జ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్, సేల్స్ వంటి అనేక విభాగాల్లో ఆయన పనిచేశారు.

కృతివాసన్ టీసీఎస్ ఐర్లాండ్ డైరెక్టర్ల బోర్డు, టీసీఎస్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏజీ పర్యవేక్షక బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని, ఐఐటీ కాన్పూర్ నుంచి ఇండస్ట్రియల్ అండ్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com