సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
- March 16, 2023
సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లోని ఏడు, ఎనిమిదో అంతస్తుల్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. భవనంలో ఎనిమిది మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది.
దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక అగ్ని ప్రమాదంతో భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగ కమ్ముకున్నది. ప్రస్తుతం స్వప్న లోక్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అంటే మెన్స్ వేర్ షాపులకు పెట్టింది పేరు. ఇక్కడ ఇప్పుడు రద్దీగా ఉంటుంది. ప్రతి రోజూ వేలాది మంది అక్కడ దుస్తులు కొనుగోలుకు వస్తుంటారు. మెన్స్ వేర్ కు ఫారెవర్ అనే ట్యాగ్ కూడా ఉంది. అలాంటి ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడం తో అంత ఖంగారుపడుతున్నారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







