మక్కాలో నలుగురు దాయిష్ తీవ్రవాదుల మృతి
- May 05, 2016
దాయీష్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరో ఇద్దరు తమను తాము పేల్చేసుకున్నారు. పవిత్ర మక్కా వెలుపల ఈ ఘటన చోటుచేసుకుందని ఇంటీరియర్ మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. భద్రతాదళాలపైకి తీవ్రవాదులు కాల్పులు జరిపాయనీ, ప్రతిగా భద్రతా దళాలు ఎదురుదాడికి దిగాయనీ, ఈ ఘటనలో మొత్తం నలుగురు చనిపోయారని అధికారులు వివరించారు. తమను తాము పేల్చేసుకున్న వ్యక్తులు బెల్టు బాంబుల్ని ఉపయోగించారని మినిస్ట్రీ వెల్లడించింది. ఈ ప్రమాదంలో సామాన్యులెవరూ గాయపడలేదు. సెక్యూరిటీ సిబ్బందికి సైతం గాయాలు కాలేదు. సౌత్ వెస్ట్రన్ బిషా ప్రావిన్స్‌లో ఇద్దరు దాయిష్ అనుమానిత వ్యక్తులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియాలో తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు నిత్యకృత్యంగా మారిపోయాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







