దుబాయ్ ఇంటర్నేషనల్ హార్స్ ఫెయిర్‌కు హాజరైన షేక్ మహ్మద్

- March 18, 2023 , by Maagulf
దుబాయ్ ఇంటర్నేషనల్ హార్స్ ఫెయిర్‌కు హాజరైన షేక్ మహ్మద్

దుబాయ్: 20వ దుబాయ్ ఇంటర్నేషనల్ అరేబియన్ హార్స్ ఛాంపియన్‌షిప్‌కు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుక్రవారం హాజరయ్యారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో మార్చి 17న ప్రారంభమైన ఈ ఛఆంపియన్ షిప్  19వ తేదీ వరకు జరుగనుంది. ఇందులో 14 విభాగాల్లో 151 గుర్రాలు పోటీ పడుతున్నాయి. మొత్తం $4 మిలియన్ల ప్రైజ్ మనీ బహుమతి కింద ప్రకటించారు. షేక్ మొహమ్మద్ తోపాటు షేక్ హెస్సా బింట్ హమ్దాన్ అల్ మక్తూమ్, దుబాయ్ ఎకానమీ అండ్ టూరిజం డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ హెలాల్ అల్ మర్రి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com