బహ్రెయిన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్
- March 19, 2023బహ్రెయిన్: బహ్రెయిన్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను అధికారులు అరెస్ట్ చేశారు. ఇందులో ఏడుగురు యూరోపియన్ జాతీయులు, ఒక జీసీసీ జాతీయుడు, ఒక అరబ్ మహిళ, ముగ్గురు బహ్రెయిన్లు ఉన్నారు. వీరికి సంబంధించిన కేసులో తుది వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. నేరారోపణలు నిరూపణ అయితే వీరికి భారీ జరిమానాలతోపాటు జైలు శిక్షలు పడే అవకాశం ఉంది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఓ పోలీసు అధికారి డ్రగ్స్ కావాలంటూ ముఠా సభ్యుడిని ఆశ్రయించాడు. బీడీ 120 విలువైన కొకైన్‌ను కొనేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఫ్ జిల్లాలో ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి చేరుకున్న ముఠా సభ్యుడు.. డ్రగ్స్‌ను అందజేయగానే పోలీసు అధికారులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి BD8,000 నగదుతో సహా భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంలో ముఠాలోని మిగతా సభ్యులను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు