ట్రక్ డ్రైవర్ హిట్ అండ్ రన్ కేసు.. 4 గంటల్లో డ్రైవర్ అరెస్ట్
- March 20, 2023
యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో ఒక అరబ్ వ్యక్తి మరణానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను 4 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు రస్ అల్ ఖైమా పోలీస్ జనరల్ కమాండ్ తెలిపింది. శనివారం ఉదయం ఒక అరబ్ వ్యక్తిపైకి దూసుకెళ్లి అక్కడి నుంచి మరో ఎమిరేట్ వైపు పారిపోయిన ఆసియా ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున 3:55 గంటలకు ప్రమాదం జరిగిందని రస్ అల్ ఖైమా పోలీస్ ట్రాఫిక్, పెట్రోల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ అహ్మద్ అల్-సామ్ అల్ నక్బీ తెలిపారు. ఓ వ్యక్తిని ట్రక్కు ఢీకొట్టినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందిందని చెప్పారు. పోలీసు పెట్రోలింగ్‌లు, జాతీయ అంబులెన్స్‌లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని, మృతుడు తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి అందులోంచి దిగినట్లు తేలిందని ఆయన వివరించారు. కానీ అప్రమత్తంగా ఉన్న ట్రక్కు డ్రైవర్ ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మృతుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వెంటనే నిఘా కెమెరాల సహాయంతో షార్జాలోని ఒక ప్రాంతంలో ట్రక్కు ఉన్న ప్రదేశాన్ని గుర్తించినట్లు అల్ నక్బీ తెలిపారు. RAK పోలీసులు నేరస్థుడిని షార్జా పోలీస్ జనరల్ కమాండ్ సమన్వయంతో అరెస్ట్ చేశామన్నారు. ట్రక్ డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక అధికారులకు రిఫర్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం