ఒమన్‌లో కనీస వేతనంపై కార్మిక శాఖ సమీక్ష

- March 20, 2023 , by Maagulf
ఒమన్‌లో కనీస వేతనంపై కార్మిక శాఖ సమీక్ష

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో కనీస వేతనాన్ని OMR 360కి పెంచడానికి సమీక్ష కొనసాగుతోందని కార్మిక మంత్రి మహద్ బావిన్ ధృవీకరించారు. సమీక్షకు సంబంధించిన అంశాలలో సగటు నెలవారీ వేతనాలు, వార్షిక ద్రవ్యోల్బణం రేటు కూడా ఉన్నాయని తెలిపారు. ఒమన్ సుల్తానేట్‌లో కనీస వేతనం OMR 360-400 మధ్య ఉంటాయని భావిస్తున్నారు. వాస్తవానికి కార్మిక మంత్రిత్వ శాఖ 2020లో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయ డిగ్రీలు ఉన్నవారికి దీని కారణంగా అన్యాయం జరుగుతుందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అనంతరం మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.  వేతనాలను అర్హతలతో ముడిపెట్టరాదని మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఒమానిసేషన్ రేట్లను పెంచడం, పౌరులకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడం కోసం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com