మొటిమలకు గుమ్మడి గింజల టిప్.! ఎలాగో తెలుసా.?
- March 20, 2023మొటిమలు యవ్వనంలో వున్న యువతీ యువకులను బాధించే ప్రధాన సమస్యల్లో ఒకటి. హార్మోనల్ ఛేంజింగ్ కారణంగా యవ్వనంలో మొటిమలు రావడం సర్వ సాధారణం. అయితే, కొందరిలో ఈ సమస్య తక్కువగా వుండొచ్చు. ఇంకొందరిలో భరించలేనంగా బాధించొచ్చు.
మార్కెట్లో మొటిమల కోసం అనేక ఫేస్ క్రీమ్‌లు అందుబాటులో వున్నాయ్. కానీ, వాటితో మంచితో పాటూ, చెడుకే ఎక్కువ ఆస్కారం వుంది.
అందుకే, ఇంట్లో సహజ సిద్ధమైన రెమిడీతో మొటిమల్నీ, వాటి వల్ల కలిగే నల్ల మచ్చల్నీ ఈజీగా తొలిగించుకోవచ్చు.
ఎండబెట్టిన గుమ్మడి గింజల్ని మిక్సీలో వేసి పేస్ట్లులా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కి కాస్త తేనె, యాపిల్ వెనిగర్ మిక్స్ చేసుకోవాలి. వెనిగర్ అందుబాటులో లేకుంటే రెండు చుక్కల నిమ్మరసమైనా ఉపయోగించొచ్చు.
ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటూ, మెడకూ అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మొటిమలతో పాటూ, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు కూడా తొలిగిపోతాయ్. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా చేస్తే క్రమ క్రమంగా మచ్చలు మానిపోతాయ్.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల