మార్చి 21న శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల
- March 20, 2023
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మంగళవారం(మార్చి21,2023) శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటాను విడుదల చేయనుంది. జూన్ నెల ఆన్ లైన్ కోటా శ్రీవాణి దర్శనం టికెట్లను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జూన్ నెల కోటాను మార్చి23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల టికెట్లను విడుదల చేయనుంది. జూన్ నెల ఆర్జితసేవా టికెట్ల ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ మార్చి24న ఉదయం 11 గంటలకు మొదలు కానుంది. జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి24న టీటీడీ విడుదల చేయనుంది.
ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు ఏప్రిల్ నెల ఉచిత, ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







