ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముగిసిన కవిత విచారణ..
- March 20, 2023
న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. సోమవారం రాత్రి 09.00 గంటల తర్వాత కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఉదయం 11.00 గంటల నుంచి ఢిల్లీలోని కార్యాలయంలో కవితను ఈడీ అధికారులు విచారించారు.
దాదాపు పదిన్నర గంటలుపైగా కవితను అధికారులు ప్రశ్నించారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కూడా కవితను అధికారులు ప్రశ్నించారు. కవిత విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద సాయంత్రం నుంచి ఉత్కంఠ నెలకొంది. విచారణ సందర్భంగా కవిత వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్ర, కవిత ప్రమేయం, ఆధారాల ధ్వంసం వంటి అంశాలపై అధికారులు ప్రశ్నించారు. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదని కవిత చెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే విషయం కూడా తెలియదని కవిత చెప్పారని సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 11న జరిగిన విచారణ సందర్భంగా కవిత తాను ఇచ్చిన వాంగ్మూలానికి కొనసాగింపుగానే, ఈ రోజు కూడా తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణ ముగిసిన నేపథ్యంలో, మంగళవారం మరోసారి ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







