అయ్యో ‘సోషల్ మీడియా’ కాలం: కోట శ్రీనివాసరావును చంపేశారుగా.!
- March 21, 2023
సోషల్ మీడియా వచ్చాకా కొంత మంచితో పాటూ, కొంత చెడు కూడా జరుగుతోంది. ముఖ్యంగా బతికున్నవాళ్లని చంపేస్తుండడం దారుణం. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీల విషయంలో ఈ తొందరపాటు జరుగుతోంది. సోషల్ మీడియాతో పాటూ, మీడియా జనం కూడా పలువురు సెలబ్రిటీలను మీడియా సాక్షిగా చంపేస్తున్నారు. ‘మేం బతికే వున్నాం మొర్రో’ అని సదరు సెలబ్రిటీలు ప్రత్యక్షంగా రెస్సాండ్ అయితే కానీ, అసలు విషయం బోధపడడం లేదు.
తాజాగా సీనియర్ నటులు కోట శ్రీనివాసరావును చంపేశారు. పాపం ఆయన బతికే వున్నారు. అదే విషయాన్ని ఓ వీడియో ద్వారా ఆయన తెలియచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లోపే జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది.
నిజంగానే ఆయన మరణించారనుకుని, పోలీసు బందోబస్థు ఆయన ఇంటి ముందు వాలిపోయింది. సెలబ్రిటీలు మరణిస్తే, వారి ఇంటి ముందు అభిమానుల ఒత్తిడి పెరుగుతంది. ఆ లెక్కల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కట్ చేస్తే.. అదంతా ఫేక్ న్యూస్ అని తేలింది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!