యూఏఈలో రేపటి నుంచి రమదాన్ ప్రారంభం
- March 22, 2023
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. రమదాన్ మొదటి రోజు ఉదయం 5.02 గంటలకు ఫజ్ర్ (ఉదయం) ప్రార్థన జరుగనుంది. ముస్లింలు సాధారణంగా ఇమ్సాక్ సమయంలో తినడం మానేస్తారు. ఇది ప్రార్థన కోసం ఫజర్ పిలుపుకు 10 నిమిషాల ముందు ఉంటుంది. ఇస్లామిక్ అఫైర్స్ అండ్ ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ (IACAD) వెబ్‌సైట్ ప్రకారం.. ఇమ్సాక్ ఉదయం 4.52 గంటలకు ఉండగా.. ఇఫ్తార్ సాయంత్రం 6.35 గంటలకు ఉంటుంది. మొత్తంగా పవిత్ర మాసం మొదటి రోజున 13 గంటల 43 నిమిషాల పాటు ఉపవాస సమయం ఉంది. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం ఈ సంవత్సరం పవిత్ర మాసం 29 రోజులపాటు ఉంటుంది. రమదాన్ 29న, ఇమ్సాక్ ఉదయం 4.21 గంటలకు, ఇఫ్తార్ సాయంత్రం 6.47కి ఉంటుంది. యూఏఈలో ఈద్ అల్ ఫితర్ మొదటి లాంగ్ వీకెండ్‌ను తీసుకువస్తుంది. అధికారిక ఈద్ అల్ ఫితర్ సెలవుదినం రమదాన్ 29 నుండి షవ్వాల్ 3 వరకు.. ఏప్రిల్ 20(గురువారం) నుండి ఏప్రిల్ 23 (ఆదివారం) వరకు సెలవులు రానున్నాయి.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025