చెల్లుబాటు వీసాలు లేనివారికి సహాయం చేయొద్దు.. నివాసులకు హెచ్చరిక

- March 22, 2023 , by Maagulf
చెల్లుబాటు వీసాలు లేనివారికి సహాయం చేయొద్దు.. నివాసులకు హెచ్చరిక

సౌదీ: చెల్లుబాటు అయ్యే వీసాలు లేని వారికి సహాయం చేయవద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం దేశంలో నివాసితులు, యజమానులను హెచ్చరించింది. ఈ మేరకు పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీ ఓ ప్రకటనను విడుదల చేసింది. వీసాల నిబంధనలను ఉల్లంఘించేవారికి ఉపాధి కల్పించడం, నివాసం కల్పించడం, సహాయం చేయడం వంటివి చేయకూడదని నివాసితులను కోరింది. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించేవారికి SAR100,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని హెచ్చరించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది.  అదే విధంగా తగిన వీసా లేని వ్యక్తిని నియమించుకున్న యజమానికి SAR100,000 వరకు జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుందని ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు సందరు యజమానులు ఆరు నెలల పాటు రిక్రూట్‌మెంట్‌పై నిషేధం విధిస్తామని పేర్కొంది.  మక్కా అల్-ముకర్రామా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లో (911)..  దేశంలోని మిగిలిన ప్రాంతాలలో (999) కాల్ చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com