మితిమీరిన ప్రవర్తనలొద్దు: రాయల్‌ ఒమన్‌ పోలీసుల హెచ్చరిక

- May 06, 2016 , by Maagulf
మితిమీరిన ప్రవర్తనలొద్దు: రాయల్‌ ఒమన్‌ పోలీసుల హెచ్చరిక


యువత నేషనల్‌ హాలిడేస్‌ మరియ ఈవెంట్స్‌లో మితిమీరిన ప్రవర్తనతో, అభ్యంతకర ప్రవర్తనతో కష్టాలు కొనితెచ్చుకోకూడదని రాయల్‌ ఒమన్‌ పోలీసులు సూచించారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ట్రాఫిక్‌ ఎవరేనెస్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఖామిస్‌ బిన్‌ అలి అల్‌ మత్తాషి ట్విట్టర్‌లో ఈ మేరకు యువతకు విజ్ఞప్తి చేశారు. తమ సంతోషాల్ని వ్యక్తం చేసే క్రమంలో సంప్రదాయాల్ని మర్చిపోకూడదని ఆయన చెప్పారు. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఉల్లంఘించి, రోడ్లపై తిరుగుతుండడం, రోడ్లకు అడ్డంగా గుంపులు గుంపులుగా నిల్చోవడం, రోడ్లపై డాన్సులు చేసి ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగజేయడం, అలాగే మితిమీరిన సౌండ్‌ చేయడం, పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పాడు చేయడం, జుగుప్సాకరమైన రీతిలో వస్త్రాలను ధరించడం వంటివి చేయరాదని ఆయన హెచ్చరించారు. ఇలాంటి చర్యలు, పర్యాటకుల మదిలో దేశం పట్ల నెగెటివ్‌ ఇంపాక్ట్‌ని కలిగిస్తాయని ఆయన అన్నారు. నేషనల్‌ ఈవెంట్స్‌ సందర్భంగా ఇలాంటి చర్యలు ఇంకా ఇబ్బందికరమని ఆయన అన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై రాయల్‌ ఒమన్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని బత్తాషి హెచ్చరించారు. యువత భవిష్యత్తులో దేశానికి దిశానిర్దేశం చేయాల్సి ఉందనీ, వారే నిబంధనలు ఉల్లంఘించరాదనీ, బాధ్యతగా వ్యవహరించి దేశానికి పేరు తేవాలని చెప్పారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com