'రానా' ఫస్ట్ లుక్ & టీజర్
- March 23, 2023
హైదరాబాద్: చిత్ర నిర్మాత రామి శెట్టి సుబ్బారావు మాట్లాడుతూ..మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చిన నిర్మాత సి. కళ్యాణ్, దర్శకులు వీరు పొట్ల, నక్కిన త్రినాథ రావు, నిర్మాత ప్రసన్న కుమార్ స్వామి నాయుడు తదితరులందరికీ మా ధన్యవాదాలు.దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా సగటు ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
చిత్ర దర్శకులు సత్యరాజ్ మాట్లాడుతూ.. మా సినిమాను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు."రానా" (రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి) ఇదొక విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ & క్రైమ్ స్టోరీ.ఈ కథలో లవ్, ఎమోషన్, డ్రామా ఫన్ సస్పెన్సు ఇలా అన్ని కలగలపిన ఉగాది పచ్చడిలా ఈ సినిమా ఉంటుంది .నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. వీరందరి సపోర్ట్ చేయడం వలన సినిమా బాగా వచ్చింది.చూసిన వారందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
గెస్ట్ గా వచ్చిన రామదాసు మాట్లాడుతూ.. రానా రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి టైటిల్ బాగా ఉంది. డైరెక్టర్ సత్యారాజ్,మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నారు. ప్రొడ్యూసర్ సుబ్బారావు ఆ కథను నమ్మి చేస్తున్నాడు. కంటెంట్ ను నమ్ముకొని తీసుకొని తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి . కాబట్టి ఈ సినిమాలో ఎమోషన్, లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.
గెస్ట్ గా వచ్చిన స్వామి నాయుడు మాట్లాడుతూ..నిర్మాత నెల్లూరు జిల్లాలో ఆపదలో ఉన్న ఎంతోమందికి హెల్ప్ చేశాడు. సీతాకొక చిలుక వంటి మంచి కథతో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.
చిత్ర హీరో రవితేజ నున్నా మాట్లాడుతూ.. ఇది నామొదటి చిత్రం. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
నటీ నటులు
రవితేజ నున్నా, నేహా జూరేల్, నాగి నీడు, ప్రమోదిని, యోగి కాత్రి, అజీజ్, వీరేంద్ర,కంచిపల్లి అబ్బులు, జబర్దస్త్ బాబీ, జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజీ, అప్పిరెడ్డి మోహన్ తదితరులు తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ : మణికొండ రంజిత్
బ్యానర్ : తన్విక & మోక్షిక క్రియేషన్స్
రైటర్ & డైరెక్టర్ : సత్య రాజ్
నిర్మాత : రామిశెట్టి వెంకట సుబ్బారావు
మ్యూజిక్ : రోషన్ సాలూరి
డి. ఓ. పి : మురళి కృష్ణ వర్మ
కో ప్రొడ్యూసర్ : కలవకొలను సతీష్, రత్నవీర్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : రెంటికోట ధర్మ, రవి.యం
ఎడిటర్ : కిషోర్
కోరియోగ్రఫీ : రవి. యం
పి ఆర్. ఓ : హరీష్, దినేష్
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!