నివాసితులు,యజమానులకు సౌదీ సీరియస్ వార్నింగ్..
- March 23, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని నివాసితులు, యజమానులకు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చెల్లుబాటయ్యే వీసా లేని వారికి ఎట్టిపరిస్థితుల్లో ఎలాంటి సాయం చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీ కీలక ప్రకటన చేసింది. వీసాల నిబంధనలను ఉల్లంఘించేవారికి ఉపాధి కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం, సహాయం చేయడం వంటివి చేయకూడదని నివాసితులను కోరింది.ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారికి 1లక్ష సౌదీ రియాల్స్ జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలియజేసింది.అలాగే శిక్షకాలం పూర్తైన తర్వాత దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని తెలిపింది.
అదేవిధంగా తగిన వీసాలేని కార్మికులను నియమించుకునే యజమానులకు కూడా 1లక్ష సౌదీ రియాల్స్ జరిమానాతో పాటు 6నెలల జైలు శిక్ష ఉంటుందని తన ప్రకటనలో పేర్కొంది. అంతేగాక సదరు యజమానులు ఆరు నెలల పాటు రిక్రూట్మెంట్ నిర్వహించకుండా బ్యాన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక వీసా షరతులను పూరించని స్వయం ఉపాధి పొందే వ్యక్తికి 50వేల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది.ఆ తర్వాత సదరు వ్యక్తిని దేశం నుంచి బహిష్కరిస్తారు.మక్కా అల్-ముకర్రామా,రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రజలు 911 నంబర్‌కు, దేశంలోని మిగిలిన ప్రాంతాలలో నివాసం ఉండేవారు 999 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి సమాచారం ఇవ్వొచ్చని తెలియజేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!