ప్రధాని మోదీ పేర్ల పై కామెంట్స్.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
- March 23, 2023
సూరత్: ప్రధాని మోదీ పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. పరువు నష్టం కేసులో ఐపీసీ సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంది.మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దీని పై గుజరాత్ బిజెపి ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లారు. రాహుల్పై పరువునష్టం కేసు వేశారు.విచారణ జరిపిన గుజరాత్లోని సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.అయితే జైలు శిక్ష తీర్పు సమయంలో రాహుల్ గాంధీ కోర్టులోనే ఉన్నారు. తీర్పుతో షాక్ అయ్యారు. ఇదే సమయంలో బెయిల్ కూడా మంజూరు చేసింది సూరత్ కోర్టు.
కాగా, 2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు.ఈ వ్యాఖ్యల పై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టులో కేసు వేశారు ఓ వ్యక్తి. రెండేళ్ల విచారణ తర్వాత.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 2023, మార్చి 23వ తేదీ గురువారం.. సూరత్ కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ ప్రతిష్టకు భంగం కలిగించారని.. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







