‘ఎన్టీయార్ 30’.! మనుషుల కన్నా మృగాలే ఎక్కువ.!

- March 23, 2023 , by Maagulf
‘ఎన్టీయార్ 30’.! మనుషుల కన్నా మృగాలే ఎక్కువ.!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీయార్ అభిమానుల కోరిక నెరవేరింది. ఎన్టీయార్ 30 సినిమా తాజాగా లాంచ్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీయార్ నటిస్తున్న సినిమా ఇది. చిత్ర యూనిట్‌తో పాటూ, హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా సినిమా ప్రారంభోత్సవానికి హాజరైంది. 

జాన్వీకపూర్ సౌత్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సినిమా కూడా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయ్. మొదట్నుంచీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయ్. 

ఇక లాంచింగ్ డే సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఎన్టీయార్. ఈ సినిమాలో మనుషుల కన్నా మృగాలే ఎక్కువ వుంటాయ్.. అని చెప్పడం సినిమాపై అంచనాల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.

సినిమాని చాలా చాలా పవర్‌ఫుల్‌గా తీర్చి దిద్దబోతున్నారన్న ఎన్టీయార్ మాటల ద్వారా అర్ధమవుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీయార్ నటిస్తున్న సినిమా కావడంతో, ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమాని నిర్మిస్తున్నారు. చూడాలి మరి, ఆల్రెడీ ‘ఆర్ఆర్ఆర్’తో సంపాదించుకున్నఎన్టీయార్ ప్యాన్ ఇండియా గుర్తింపును కొరటాల ఏ స్థాయిలో నిలబెట్టనున్నాడో ఈ సినిమాతో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com