రమదాన్: ‘వన్‌హార్ట్ బహ్రెయిన్’ క్యాంపెయిన్ ప్రారంభం
- March 23, 2023
బహ్రెయిన్: వన్‌హార్ట్ బహ్రెయిన్ పవిత్ర రమదాన్ మాసంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి క్యాంపెయిన్ ను నిర్వహిస్తుంది. 2,000 మందికి ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. రమదాన్ మాసంలో మంచి చేయాలనే స్ఫూర్తితో.. సమాజానికి తిరిగి ఇవ్వాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రమదాన్ , ఈద్ క్యాంపెయిన్ కు చెందిన వాలంటీర్ అయిన నూర్ మురాద్ తెలిపారు. నిరాశ్రయులకు భోజనాన్ని అందించడం తమ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం అన్నారు. వన్‌హార్ట్ బహ్రెయిన్ తన 'టుగెదర్ వి గివ్, టుగెదర్ వి ఈట్' ప్రచారం ద్వారా బహ్రెయిన్‌లోని 2,000 మందికి ఆహారాన్ని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. "మొత్తం మూడు 'టుగెదర్ వి గివ్' ఇఫ్తార్ ఈవెంట్లు ఉంటాయి. ఇవి వివిధ లేబర్ క్యాంపులలో ఆహారాన్ని అందజేస్తాయి.అలాగే మస్జీదులలోనూ ఉంటాయి" అని నూర్ చెప్పారు. ఇఫ్తార్ ఈవెంట్ ఏప్రిల్‌లో జరగనుంది. ఇక్కడ వన్‌హార్ట్ బహ్రెయిన్ అవుట్డోర్ ఫుడ్ పాప్ అప్ బూత్‌ను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా వన్‌హార్ట్ అవసరమైన కుటుంబాల కోసం 'ఈద్ మీల్స్ విత్ లవ్'ను కూడా నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు తయారు చేసిన భోజనాలను పంపిణీ చేశారు. "అత్యవసర ఆహార మద్దతు అవసరమైన 20 కుటుంబాలకు భోజనం నేరుగా పంపిణీ చేయబడుతుంది" అని నూర్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!







