ఇలా కళ్లకు మంచిది!
- May 06, 2016
ఈ కాలంలో ఎండలో వెళ్లినప్పుడూ, ప్రయాణాలు చేసినప్పుడు సరిగా నిద్రలేక కళ్లు అలసిపోతాయి. కొందరికైతే వాపు కూడా ఉంటుంది. అలా అలసిన కళ్లకు సాంత్వన అందించి.. వాపు తగ్గించాలంటే ఇలా చేయండి..
చల్లనినీరు: కళ్లను కడుక్కోవాలనే ఉద్దేశంతో చాలామంది ముఖం కడుక్కుని.. తువాలుతో గట్టిగా తుడిచేస్తుంటారు. అలాకాకుండా.. కళ్ల మీద నీళ్లను చల్లడం మంచిది. పదే పదే అలా చల్లటి నీళ్లతో కళ్లు తడుపుతుంటే ఉపశమనంగా అనిపిస్తుంది.
రెప్పలు ఇలా:
కళ్లు అలసిపోయినప్పుడు, ఉబ్బినప్పుడు.. ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఆ రేడియేషన్ వల్ల సమస్య మరింత పెరుగుతుంది. తరచూ కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రెప్పల్లో రక్తప్రసరణ బాగుంటుంది. సమస్యలుంటే దూరమవుతాయి. కంటిలోపలున్న దుమ్మూధూళీ బయటకు వచ్చి కళ్లు శుభ్రపడతాయి.
గుడ్డుసొన: గుడ్డులోని తెల్లసొనతో కంటి చుట్టూ.. కనురెప్పల మీదా పూతలా వేసుకోవాలి. ఈ పూత వల్ల కంటి చుట్టూ చర్మం బిగుతుగా మారుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం ఉత్తేజితమై... కళ్ల అలసటతోపాటూ, వాపూ అదుపులోకి వస్తుంది.
టీ బ్యాగ్: గ్రీన్ టీ.. కళ్లకీ మేలు చేస్తుంది. ఆ టీ బ్యాగులను ఐస్‌నీళ్లలో ఉంచాలి. అరగంటయ్యాక బయటకు తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. గ్రీన్‌టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కళ్ల మీద నేరుగా పనిచేస్తాయి. అలసట దూరం చేస్తాయి. కళ్ల కింద ముడతల్ని తగ్గిస్తాయి.
పాలు: గిన్నెలో పచ్చి పాలను తీసుకుని అందులో కొన్ని దూది ఉండల్ని ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. కాసేపయ్యాక తీసి ఆ దూది ఉండల్ని కళ్ల మీద పెట్టుకుంటే.. వాపూ, అలసట తగ్గిపోతాయి. ఒత్తిడి ఉన్నప్పుడు రోజుకి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బంగాళాదుంప: బంగాళాదుంపను సన్నగా గుండ్రంగా తరిగి ఫ్రిజ్‌లో ఉంచాలి. గంటయ్యాక తీసి కళ్ల మీద పెట్టుకోవాలి. ఆ ముక్కలు వేడిని లాగేసి.. కళ్లకు సాంత్వన అందిస్తాయి. ప్రయాణాలు చేసేవారు... తప్పనిసరిగా బంగాళాదుంపల ముక్కల్ని కళ్ల మీద పెట్టుకోవాలి. వేడికి అలసిపోకుండా ఉంటాయి.
తాజా వార్తలు
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక







