నాని సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్న రాజమౌళి
- May 06, 2016
భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీరప్రేమగాథ సినిమాల హిట్స్‌తో ఫుల్ జోష్‌మీదున్నాడు టాలీవుడ్ యాక్టర్ నాని. ప్రస్తుతం నాని జెంటిల్‌మెన్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన నాని రియల్‌లైఫ్‌లో పోషించిన పాత్రను రీల్‌లైఫ్‌లో కూడా పోషించనున్నారు. లేటెస్ట్ ప్రాజెక్టులో నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. విరించి వర్మ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా వస్తోన్న ఈ మూవీలో ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి అతిథి పాత్రలో కనిపించనున్నారట. విరించి వర్మ దర్శకత్వంలో వచ్చిన ఉయ్యాలా జంపాలా మంచి హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







