ఉస్మానియా యూనివర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం..
- March 24, 2023
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈరోజు (మార్చి 24 ) విద్యార్థులు నిరుద్యోగ మార్చ్, నిరసన దీక్షకు పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు , పలు విద్యార్థి సంఘాలు ఓయూ కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేస్తున్నారు. మరోపక్క టీపీసీసీ చీఫ్ రేవంత్ ను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. నిరుద్యోగ మార్చ్ కు ముఖ్య అతిధిగా రేవంత్ ను ఆహ్వానించినా నేపథ్యంలో పోలీసులు అయ్యాను హౌస్ అరెస్ట్ చేసారు.
ఓయూకి వెళ్లి తీరతానని రేవంత్ చెబుతున్నారు. దీక్ష జరిగి తీరుతుందని ఓయూ విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఓయూకు వస్తే రేవంత్‌ను అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్వీ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి , . రేవంత్ ఇంటికి వెళ్లే దారులన్నీ మూసేశారు. రేవంత్ ఇంటికి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్







