వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్..
- March 24, 2023
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ప్రముఖ మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ తమ యూజర్ల కోసం మల్టీ డివైజ్ లింక్ చేసే ప్రక్రియను సులభతరం చేసింది. విండోస్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త యాప్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. Windows డెస్క్‌టాప్ యూజర్ల కోసం కొత్త వాట్సాప్ యాప్ మొబైల్ యాప్‌ను పోలి ఉంటుంది. మల్టీ డివైజ్‌ల్లో వాట్సాప్ ఉపయోగించేందుకు అనుమతిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వాట్సాప్ యూజర్లు ఇప్పుడు తమ వాట్సాప్ అకౌంట్‌ను గరిష్టంగా 4 డివైజ్‌లకు లింక్ చేయవచ్చని వాట్సాాప్ ప్రకటించింది.
తమ చాట్‌లు వారి ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా సింకరైజ్ అవుతాయి. అలాగే డేటా యాక్సెస్ చేసేందుకు అనుమతినిస్తుంది. విండోస్ డెస్క్‌టాప్‌లో వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత వినియోగదారులు దాదాపు అన్ని డివైజ్‌ల్లో వీడియో, వాయిస్ కాలింగ్ ఆప్షన్లు, డివైజ్ లింక్‌లతో సహా కొత్త ఫీచర్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.
వాట్సాప్ లేటెస్ట్ ట్వీట్‌లో ఛార్జర్ అందించడం లేదు. ఇప్పుడు వాట్సాప్ ని గరిష్టంగా 4 డివైజ్‌లకు లింక్ చేయవచ్చు. మీ చాట్‌లు సింకరైజ్ అవుతాయి. మీ ఫోన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన తర్వాత కూడా యాక్సెస్ అవుతాయి. మీ వాట్సాప్ అకౌంట్ మల్టీ డివైజ్‌ల్లో ఉపయోగించాలనుకుంటే, మీ అకౌంట్ మీ ప్రైమరీ మొబైల్ డివైజ్ లింక్ చేసేందుకు ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
వాట్సాప్‌లో మల్టీ డివైజ్‌లకు ఎలా లింక్ చేయాలంటే?
– మీ ఫోన్ నంబర్‌కి లింక్ చేసిన మీ ప్రైమరీ డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
– ‘Settings’కి వెళ్లి, ‘Linked Devices’ ఎంచుకోండి.
– ‘కొత్త డివైజ్ లింక్ చేయి’ నొక్కండి. స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
– విండోస్ డెస్క్‌టాప్ మాదిరిగా రెండవ డివైజ్ కనెక్ట్ చేసేందుకు వెబ్ బ్రౌజర్‌లో (web.whatsapp.com) వాట్సాప్ వెబ్ పేజీని ఓపెన్ చేయండి.
– మీ సెకండ్ డివైజ్‌తో వెబ్ పేజీలోని QR కోడ్‌ని స్కాన్ చేయండి.
– డివైజ్ సింకరైజ్ చేసే వరకు వేచి ఉండండి. మీ చాట్‌లు సెకండ్ డివైజ్‌లో కనిపిస్తాయి.
– మరిన్ని డివైజ్‌లను లింక్ చేసేందుకు అదే విధానాన్ని ఫాలో చేయండి.
– మీరు గరిష్టంగా 4 డివైజ్‌లకు కలిపి లింక్ చేయవచ్చు. లింక్ చేసిన డివైజ్‌లు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసేంత వరకు మీ వాట్సాప్ అకౌంట్ కనెక్ట్ అవుతాయి.
– మీరు వాట్సాప్ యాప్ నుంచి Log Out చేయడం ద్వారా ఎప్పుడైనా డివైజ్ Unlink చేయవచ్చు.
మీరు ఒకేసారి 4 లింక్ చేసిన డివైజ్‌లను ఒక ఫోన్‌లో ఉపయోగించవచ్చు. మీ వ్యక్తిగత మెసేజ్‌లు, మీడియా, కాల్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయి. ప్రతి లింక్ చేసిన డివైజ్ స్వతంత్రంగా వాట్సాప్ కి కనెక్ట్ అయి ఉంటారు. అదే స్థాయిలో ప్రైవసీ, సెక్యూరిటీని కొనసాగిస్తుంది. వాట్సాప్‌ని ఉపయోగించే యూజర్లు ఎండ్ టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కలిగి ఉంటారు.
వాట్సాప్ యూజర్ లింక్ చేసిన డివైజ్‌లలో వాట్సాప్ ని ఉపయోగించడానికి మీ ఫోన్ ఆన్‌లైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి. అయితే, మీరు మీ ఫోన్‌ని 14 రోజులకు పైగా ఉపయోగించకుంటే మాత్రం.. మీ లింక్ చేసిన డివైజ్‌లు లాగ్ అవుట్ అవుతాయి. అదనంగా, మీ వాట్సాప్ అకౌంట్ రిజిస్టర్ చేయడానికి కొత్త డివైజ్‌లకు లింక్ చేసేందుకు మీకు మీ ప్రైమరీ ఫోన్ తప్పక అవసరమని గుర్తించాలి.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







