టీఏకేటీ గ్రూప్‌తో APSSDC, APNRTS ఒప్పందం...
- March 24, 2023
అమరావతి: రాష్ట్ర యువత విదేశాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ముందడుగు వేసింది.మిడిల్ ఈస్ట్, యూరప్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, అమెరికా తదితర దేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఇందులో భాగంగా గురువారం తాడేపల్లిలోని APSSDC కార్యాలయంలో టీఏకేటీ గ్రూప్‌తో APSSDC, APNRTS త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి.
నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ సత్యనారాయణ, APNRTS ప్రెసిడెంట్ వెంకట్ ఎస్ మేడపాటి, టీఏకేటీ గ్రూప్ ఎండీ రాజ్‌సింగ్ సమక్షంలో పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా వైద్యం, నిర్మాణం, ఆతిథ్య రంగాల్లోని విదేశీ అవకాశాలపై టీఏకేటీ గ్రూప్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తొలి దశలో జర్మనీలోని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు 15 మంది నర్సింగ్ అభ్యర్థులను ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.
వీరికి జర్మనీ భాష పై 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.వీసా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో జర్మనీకి పంపిస్తారు. అలాగే సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు 192 స్కిల్ హబ్స్, 26 స్కిల్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







