ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..!
- May 07, 2016
ఇన్నాళ్లూ తెలంగాణలో రోజుకో ఉద్యోగ ప్రకటన వెలువడుతూ సందడి చేస్తుంటే.. అయ్యో ఆ భాగ్యం మాకు లేదే అని చింతించిన ఏపీ నిరుద్యోగులకు ఇక ఆ చింత అవసరం లేదట. ఏపీలోనూ ఇక వరుస నోటిఫికేషన్లు రాబోతున్నాయట. ఏపీపీఎస్సీ కూడా ఉద్యోగ ప్రకటనల కోసం సిద్ధమవుతోందట. ఈ విషయం ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ్ భాస్కర్ స్వయంగా తెలిపారు.
ఏపీపీఎస్సీ తన తొలి ఉద్యోగ ప్రకటనకు రెడీఅవుతోందట. అతి త్వరలోనే దేవాదాయశాఖలో 115 పోస్టుల భర్తీకి ప్రకటన రాబోతోందట. అంతే కాదు.. ఈ ప్రకటన తర్వాత గ్రూప్ 2 సహా వివిధ ప్రకటనలకు వరుసగా విడుదలయ్యే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన 20 వేల పోస్టుల్లో 12 వేల పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే భర్తీ అవుతాయట.
ఏపీలోనూ ఇక ఉద్యోగాల వరద..!
ప్రభుత్వం ఖాళీల వివరాలను తమకు అందజేసిన 15 రోజుల్లోనే ప్రకటన వెలువరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు తెలిపాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరికొత్త వెబ్ సైట్ ను ప్రారంభించిన నేపథ్యంలో ఏపీ నిరుద్యోగుల్లోనూ ఆశలు ఊసులెత్తాయి. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న ఏపీ నిరుద్యోగ యువత ఇక పుస్తకాలు దుమ్ముదులపాల్సిన సమయం వచ్చేసిందన్నమాట.
నిన్న మొన్నటి వరకూ తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగాల ప్రకటనల కోసం ఎదురు చూసింది. తెలంగాణలో వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడటంతో అక్కడి కోచింగ్ సెంటర్లన్నీ అభ్యర్థులతో నిండిపోయాయి. ఇక ఇప్పుడు ఏపీలోనూ అదే సీన్ కనిపిస్తుండటంతో ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్లకు మరింత కళ వచ్చే అవకాశం కనిపిస్తోంద
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









