వేసవి సహజ పానీయం మజ్జిగతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

- March 25, 2023 , by Maagulf
వేసవి సహజ పానీయం మజ్జిగతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

వేసవి తాపాన్ని తట్టుకోవడానికైనా, శరీర ఉష్ణోగ్రతని చల్లబర్చి డీహైడ్రేషన్ నుంచి తప్పించాలన్నా మజ్జిగ బెస్ట్ పానీయం. అందుకే సమ్మర్‌లో సహజ పానీయంగా మజ్జిగను అభివర్ణిస్తుంటారు.

అవును నిజమే ఇది అందరికీ తెలిసిందే. అయితే, మజ్జిగతో వచ్చే మరిన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే ఇంకాస్త ఆశ్చర్యపోతారు. ఇంతవరకూ మజ్జిగ అలవాటు లేని వాళ్లు కూడా అలవాటు చేసుకుంటారు.

మలబద్ధకం అనేది ఎవరికీ చెప్పుకోలేని అతి తీవ్రమైన సమస్య. ఈ సమస్యకు మజ్జిగ మంచి పరిష్కారం. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడం వల్ల పేగుల కదలికను సులభం చేస్తుంది. తద్వారా ఆ సమస్యకు ఉపశమనం కలుగుతుంది. 

మజ్జిగలో వుండే ఎలక్ర్టోలైట్లు వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయ్. తక్షణ శక్తినిచ్చే రిబో ఫ్లోవిన్ మజ్జిగలో ఎక్కువగా వుంటుంది. దాంతో కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. 

జీర్ణ క్రియలో ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా గ్లాసుడు మజ్జిగ తాగితే ఎసిడిటీ తదితర అసౌకర్యాలు తీరి, అంతా సెట్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com