ఆ డైరెక్టర్‌కి రష్మిక హ్యాట్రిక్ ఇస్తుందా.?
- March 25, 2023
‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది కన్నడ కస్తూరి రష్మికా మండన్నా. తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకి రష్మిక లక్కీ ఛామ్ అయ్యింది.
దాంతో ఆ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ సినిమాలోనూ వెనకా ముందూ ఆలోచించకుండా రష్మికనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. మళ్లీ హిట్ కొట్టాడు.
ఇక, ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమాకీ తన లక్కీ ఛామ్ రష్మికనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. ‘భీష్మ’ కాంబోనే మళ్లీ సెట్ చేసుకున్నాడు వెంకీ కుడుముల. ఉగాది సందర్భంగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది.
కాగా, ఈ సినిమాపై నితిన్ కాస్త ఎక్కువ టెన్షన్ ఫీలవుతున్నాడట. ఎందుకంటే, ‘భీష్మ’ స్థాయి సూపర్ హిట్ కోరుకుంటున్నాడట నితిన్. రీసెంట్‌గా నితిన్ నుంచి వచ్చిన ‘మాచర్ల నియోజక వర్గం’ డిజాస్టర్‌ని మిగిల్చింది.
సో, రాబోయే ఈ తాజా చిత్రం ఎలాగైనా హిట్ లిస్టులో పడాలనుకుంటున్నాడట. చూడాలి మరి, అటు డైరెక్టర్ వెంకీకీ, ఇటు నితిన్‌కీ కూడా ఈ ప్రాజెక్ట్ ఓ ఛాలెంజే అని చెప్పొచ్చేమో.. రష్మిక కారణంగా.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







