టర్కిష్ సిటీలో 'కింగ్ ఆఫ్ బహ్రెయిన్ అవెన్యూ'
- March 26, 2023
బహ్రెయిన్: కహ్రమన్మరాస్ ప్రావిన్స్‌లోని టర్కిష్ నగరం ఎల్బిస్తాన్ "కింగ్ ఆఫ్ బహ్రెయిన్ అవెన్యూ" పేరుతో ఒక అవెన్యూని ప్రారంభించింది. ఈ సందర్భంగా హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ కోసం రాజు ప్రతినిధి, హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా.. హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు అభినందనలు తెలిపారు. బహ్రెయిన్-టర్కిష్ సంబంధాల ఆధారంగా దేశంలో సంభవించిన వినాశకరమైన భూకంపం ప్రభావితమైన ప్రాంతాల్లో అందించిన సహాయానికి గుర్తుగా పేరును మార్పు చేసినట్లు పేర్కొన్నారు. "కింగ్ ఆఫ్ బహ్రెయిన్ స్ట్రీట్" అల్ బస్తాన్ సిటీలోని ఒక వ్యూహాత్మక ప్రదేశంలో ఉందని డాక్టర్ ముస్తఫా అల్-సయ్యద్ పేర్కొన్నారు. ఇది వినాశకరమైన భూకంపంలో తీవ్రంగా నష్టపోయింది. టర్కియేలోని సోదరుల పట్ల హెచ్‌ఎం రాజు గొప్ప మానవతా దృక్పథాలను స్మరించుకోవడానికి బహ్రెయిన్ రాజు పేరు మీద ఈ అవెన్యూ పేరు పెట్టబడిందని అతను తెలిపారు. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హైకమిషనర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని, భూకంపం వల్ల ప్రభావితమైన వారికి సహాయం అందించడానికి, విద్య -ఆరోగ్యాన్ని ఏర్పాటు చేయడానికి టర్కీ రెడ్ క్రెసెంట్, ఫారిన్ ఎకనామిక్ రిలేషన్స్ బోర్డ్ ఆఫ్ టర్కీ (DEiK) తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







