ఖతార్‌లో వింటర్ క్యాంపింగ్ సీజన్ ఏప్రిల్ 29 వరకు పొడిగింపు
- March 26, 2023
దోహా: దేశంలో ప్రస్తుత క్యాంపింగ్ సీజన్‌ను ఏప్రిల్ 29 వరకు పొడిగించనున్నట్లు పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో దక్షిణ ప్రాంతాలలో (సీలైన్, ఖోర్ అల్ ఉదీద్) క్యాంపింగ్ మే 20 వరకు కొనసాగుతుందని తెలిపింది. మంత్రిత్వ శాఖ యొక్క వింటర్ క్యాంపింగ్ వ్యవహారాల కమిటీ దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాలలో ప్రస్తుత సీజన్‌లో క్యాంపింగ్ వ్యవధిని ఏప్రిల్ 1కి బదులుగా ఏప్రిల్ 29 వరకు పొడిగించాలని నిర్ణయించింది. పర్యావరణం, వాతావరణ మార్పుల మంత్రి హిస్ ఎక్సలెన్సీ షేక్ డాక్టర్ ఫలేహ్ బిన్ నాసర్ అల్ థానీ ఆదేశాల మేరకు ఇది ఆధారపడి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మొక్కలు, చెట్లను నాటడం, క్యాంపింగ్ సైట్‌లను నిర్వహించడం, క్యాంపింగ్‌కు సంబంధించిన నియంత్రణలు- షరతులకు కట్టుబడి ఉండటం ద్వారా పర్యావరణాన్ని సంరక్షించాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







