హైదరాబాద్‌కు 'అజార్‌'

- May 07, 2016 , by Maagulf
హైదరాబాద్‌కు 'అజార్‌'

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్‌ అజారుద్దీన్ జీవితం ఆధారంగా రూపొందిన 'అజార్‌' చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టైటిల్‌ రోల్‌ను ఇమ్రాన్ హష్మి పోషించిన ఈ చిత్రానికి టోనీ డిసౌజా దర్శకుడు. ఇందులో అజార్‌ మొదటి భార్య నౌరీన్ పాత్రలో ప్రాచీ దేశాయ్‌, రెండో భార్య సంగీతా బిజ్‌లానీ పాత్రలో నర్గీస్‌ ఫక్రీ కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌లో అజారుద్దీన్ స్వయంగా పాల్గొంటుంటడం గమనార్హం. అందులో భాగంగా ఈనెల12న (గురువారం) అజార్‌, ఇమ్రాన్ హష్మి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇక్కడి అభిమానులతో వారు ఇంటరాక్ట్‌ అవనున్నారు. వారి కోసం హైదరాబాద్‌ యాసలో మాట్లాడేందుకు అజార్‌ నుంచి ఇమ్రాన్ సూచనలు అందుకున్నాడు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు సినిమా బృందం ప్రచార కార్యక్రమాల్ని విస్తృతంగా చేపట్టింది. ఇటీవల నిర్మాతలతో కలిసి హీరో ఇమ్రాన్ 'అజార్‌ఏంథమ్‌' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారాన్ని ప్రారంభించాడు. ఈ సందర్భంగా ''అజార్‌ఏంథమ్‌లో భాగమయ్యేందుకు మీకు మంచి అవకాశం. క్రికెట్‌ ఆడుతున్న మీ ఫొటోల్ని కానీ, వీడియో క్లిప్స్‌ కానీ పంపించండి'' అని ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు ఇమ్రాన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com