'ప్రతిభావంతుల ప్రపంచ రాజధాని'గా యూఏఈ: షేక్ మహమ్మద్
- March 29, 2023
యూఏఈ: దేశాన్ని 'ప్రతిభావంతుల ప్రపంచ రాజధాని'గా మార్చడానికి 19 కార్యక్రమాలను యూఏఈ కేబినేట్ సమీక్షించింది. ఈ కేబినెట్ సమావేశానికి యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్ర, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించారు. అదే విధంగా సీనియర్ మేనేజర్ల విషయంలో యూఏఈ ప్రపంచవ్యాప్తంగా ఎలా రెండవ స్థానంలో ఉందో వివరించారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాన్ని ఆకర్షించడం ద్వారా దేశం జాతీయ ప్రతిభను పెంపొందించుకోవాలని ఆయన చెప్పారు.ఇదిలా ఉండగా, వచ్చే ఏడేళ్లలో దేశ రీ-ఎగుమతి పరిశ్రమను రెట్టింపు చేసేందుకు 24 కార్యక్రమాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని షేక్ మహమ్మద్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 వాణిజ్య కార్యాలయాలు యూఏఈలో తమ నెట్‌వర్క్ ను 100 శాతం విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య చర్చల కోసం సుప్రీం కమిటీ పని ఫలితాలను కూడా కేబినెట్ సమీక్షించింది. ఇటీవల నాలుగు దేశాలతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేసామని, ప్రస్తుతం కోస్టా రికాతో సహా చాలా దేశాలతో చర్చలు జరుపుతోందని షేక్ మహమ్మద్ పేర్కొన్నారు.
.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్‌వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?