భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..!

- March 29, 2023 , by Maagulf
భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..!

యూఏఈ: 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక ఆసియా వ్యక్తి మంగళవారం షార్జాలోని నివాస భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య, ఇద్దరు పిల్లలను చంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సంఘటన స్థలం నుంచి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన జరిగిందని షార్జా పోలీసులు తెలిపారు. పోలీసులు వెంటనే అతని ఇంటికి వెళ్లి భార్య, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఈ సంఘటనపై విచారణ జరుపుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com