ఢిల్లీ విమానాశ్రయం నుండి విమానాలు దారి మళ్లింపు..!

- March 30, 2023 , by Maagulf
ఢిల్లీ విమానాశ్రయం నుండి విమానాలు దారి మళ్లింపు..!

న్యూఢిల్లీ: వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు తొమ్మిది విమానాలను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జైపూర్ విమానాశ్రయానికి మళ్లించారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ ప్రకారం.. బుధవారం సాయంత్రం ఢిల్లీలో తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ మేరకు అనేక విమానయాన సంస్థలు ప్రయాణీకులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. విమాన షెడ్యూల్‌లలో మార్పుల గురించి వారి ట్విట్టర్ ఫీడ్‌లో పోస్ట్ చేశాయి.

"ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ రద్దీ కారణంగా ముంబై నుండి ఢిల్లీకి (BOM-DEL) UK910 విమానం జైపూర్‌కు (JAI) మళ్లించబడింది. 19:40 గంటలకు జైపూర్ చేరుకుంటుంది." అని ఏయిర్ విస్తారా వెల్లడించింది. "బెంగళూరులో ఆశించిన ప్రతికూల వాతావరణం కారణంగా.. విమానాల బయలుదేరడం /రాకపోకలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు మీ విమాన స్థితిని తనిఖీ చేయండి." అని ఇండిగో పోస్ట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com