సబ్సిడీపై గొర్రెల విక్రయానికి ఫుల్ డిమాండ్..!

- March 30, 2023 , by Maagulf
సబ్సిడీపై గొర్రెల విక్రయానికి ఫుల్ డిమాండ్..!

దోహా: రమదాన్ మాసంలో జాతీయ సబ్సిడీ పథకం కింద అందజేస్తున్న గొర్రెల మాంసానికి విపరీత డిమాండ్ పెరిగిందని ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) వెల్లడించింది. స్థానికంగా గొర్రెల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొంది. మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ, విడమ్ ఫుడ్ కంపెనీతో సమన్వయంతో సబ్సిడీ ధరలకు అందజేస్తున్న మాంసానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుందన్నారు. ప్రస్తుత రమదాన్ మాసంలో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న గొర్రెలను అందజేస్తున్నామని, 35 కిలోల లేదా అంతకంటే ఎక్కువ బరువున్న గొర్రెలను QR800 ధరకే అందించాలని నిర్ణయించామని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 12 రోజుల్లో దాదాపు 11,348 గొర్రెల అమ్మకాలు జరిగాయని, అందులో 2,313 అల్-వక్రా కబేళా వద్ద, 1,851 ఉమ్ సలాల్ కబేళా, 1,780 అల్-షహానియా కబేళా, 754 అల్-ఖోర్ కబేళా , 494 నార్త్ కబేళా వద్ద.. విడమ్ కంపెనీ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ద్వారా 4,156 గొర్రెలను విక్రయించినట్లు వెల్లడించారు. మార్కెట్‌లలో గొర్రెల విక్రయాలు, ఇతర ఆహార పదార్థాల లభ్యతను నిర్ధారించడానికి విక్రయ కేంద్రాలలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపింది. ఏదైనా ఉల్లంఘనలను గుర్తిస్తే కాల్ సెంటర్ 16001 లేదా సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా రా నివేదించాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com