పిల్లలు తప్పిపోకుండా ఉచిత బ్రేస్ లెట్ల పంపిణీ
- March 30, 2023
మక్కా: మక్కాలోని గ్రాండ్ మస్జీదులో పిల్లలు తప్పిపోకుండా వారికి ఉచిత బ్రాస్లెట్లు పంపిణీ చేస్తున్నారు. హదియా, హజ్జీ, ముతామర్స్ గిఫ్ట్ ఛారిటబుల్ అసోసియేషన్ బ్రాస్లెట్ల పంపిణీని ప్రారంభించాయి. గ్రాండ్ మస్జీదులో తప్పిపోయిన పిల్లల కేసులను తగ్గించడం తమ లక్ష్యమని పంపిణీ సంస్థలు పేర్కొన్నాయి. బ్రాస్లెట్లపై పిల్లల పేరు, వారి తల్లిదండ్రుల సంప్రదింపు నంబర్ల వంటి అనేక వివరాలు ఉంటాయని తెలిపారు. బ్రాస్ లెట్లను పొందేందుకు కుటుంబాలు మక్కాలోని గ్రాండ్ మస్జీదు సమీపంలోని అసోసియేషన్ కార్యాలయాలను సందర్శించాలని సూచించారు. అసోసియేషన్ కార్యాలయాలలో ఒకటి మక్కాలో ఉండగా.. మక్కా కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో 4వ అంతస్తులో మరొకటి.. కింగ్ అబ్దుల్ అజీజ్ ఎండోమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకోటి ఉంది.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం