తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్ ..
- March 30, 2023
వాటికన్: పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. బుధవారం రాత్రి సమయంలో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ను గురువారం రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రికి తరలించారు. 86ఏళ్ల పాప్ ఫ్రాన్సిస్‌ను పరీక్షించిన వైద్యులు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం.. కోవిడ్ -19 నిర్ధారణ కాలేదని, కేవలం శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా పోప్ ఫ్రాన్సిస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్యులు వెల్లడించినట్లు వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ చెప్పారు.
ఫ్రాన్సిస్ అస్వస్థతకు గురికావటంతో గురువారం ఉదయం పోప్ అపాయింట్‌మెంట్‌లు రద్దు చేసినట్లు వాటికన్ ప్రతినిధి చెప్పారు. కొద్దిరోజులు పోప్ ఫ్రాన్సిస్ వైద్యుల పర్యవేక్షలో ఉంటారని తెలిసింది. గత ఏడాదికాలంగా దీర్ఘకాలిక మోకాలి నొప్పితో ఫ్రాన్సిస్ బాధపడుతున్నాడు. అతనికి వీల్‌చైర్ ఉపయోగించాల్సి వచ్చింది. గత సంవత్సరం జులైలో పోప్ ఫ్రావిన్స్ ఆఫ్రికా దేశాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే అతని అనారోగ్యా కారణాల దృష్ట్యా పర్యటన వాయిదా పడింది. ఆ సమయంలో పోప్ ఆరోగ్యం విషమించిందన్న ప్రచారం జరిగింది.
పోప్ ఫ్రాన్సిస్ బుధవారం ఉదయం వాటికన్‌లో తనను కలిసేందుకు వచ్చిన విశ్వాసులను పలుకరిస్తూ, నవ్వుతూ ఉత్సాహంగా కనిపించారు. సాయంత్రంకు శ్వాసకోస వ్యాధుల సమస్య ఇబ్బంది పెట్టడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో పోప్ ప్రాన్సిస్ దక్షిణ సుడాన్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను సందర్శించాడు. ఈ నెలలో హంగేరిని సందర్శించాల్సి ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు