యూఏఈ కొత్త ఉపాధ్యక్షుడు, అబుధాబి క్రౌన్ ప్రిన్స్
- March 30, 2023
యూఏఈ: ఉపాధ్యక్షుడు, అబుధాబి క్రౌన్ ప్రిన్స్, ఇద్దరు డిప్యూటీ పాలకులను నియమిస్తూ యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను యూఏఈ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. అతను యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో కలిసి పనిచేయనున్నారు. షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను అబుధాబి క్రౌన్ ప్రిన్స్‌గా నియమించారు. షేక్ ఖలీద్ అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, అబుధాబి ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. అదే విధంగా అబుధాబికి ఇద్దరు డిప్యూటీ పాలకులుగా షేక్ హజ్జా బిన్ జాయెద్ (అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్), షేక్ తహ్నౌన్ బిన్ జాయెద్( జాతీయ భద్రతా సలహాదారు)లను షేక్ మొహమ్మద్ నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు షేక్ మహ్మద్ బిన్ రషీద్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!







