ఆరెంజ్’ రీ రిలీజ్ కనీ వినీ ఎరుగని రికార్డు.!

- April 01, 2023 , by Maagulf
ఆరెంజ్’ రీ రిలీజ్ కనీ వినీ ఎరుగని రికార్డు.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూడో సినిమా ‘ఆరెంజ్’. ‘చిరుత’గా పరిచయమై ‘మగధీర’గా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘మగధీర’ సూపర్ సక్సెస్ తర్వాత వచ్చిన సినిమానే ‘ఆరెంజ్’. డిజాస్టర్‌గా ముద్ర వేయించుకుంది. 

అప్పట్లో ఈ సినిమా చాలా మందికి అర్ధం కాలేదు. దాంతో, పక్కా డిజాస్టర్ మూవీ అని తేల్చేశారు. నిర్మాతగా నాగబాబుకూ భారీ స్థాయిలో నష్టాలు మిగిల్చిందీ సినిమా. 

కానీ, ఆ నష్టాల్ని ఇన్నేళ్ల తర్వాత నాగబాబు కవర్ చేసేసుకున్నాడు. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేయడం ట్రెండ్‌గా మారిన సంగతీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, బాలయ్య.. ఇలా స్టార్ హీరోల సినిమాలు రిలీజై మంచి సక్సెస్ అందుకున్నాయ్ రీ రిలీజ్‌లో. వాటన్నింటి రికార్డుల్నీ తిరగరాస్తూ సరికొత్త రికార్డు సృష్టించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ‘ఆరెంజ్’ రీ రిలీజ్ ద్వారా.

అప్పుడు ఫ్లాప్ అయిన సినిమా ఇప్పుడెందుకు ఇంతలా హిట్ అయిపోయింది. ఒక్క రోజు మాత్రమే ప్రదర్శించాలనుకున్నారు. కానీ, ఏకంగా మూడు రోజులు ప్రదర్శించడం జరిగింది. అలా ప్లాప్ సినిమా రీ రిలీజ్‌తో కూడా రికార్డులు కొల్లగొట్టిన రారాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com