కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత
- April 02, 2023
చెన్నై: టాలీవుడ్ చిత్రసీమలో వరుస విషాదాలు ఆగడం లేదు. వరుసపెట్టి సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు,నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్ అయిన కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన…చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు మాదాసు కృష్ణ. కృష్ణ పేరుతో తెలుగు చిత్రసీమలో చాలా మంది ఉన్నారు. కానీ, కాస్ట్యూమ్స్ కృష్ణ అంటే గుర్తుకు వచ్చేది మాత్రం ఈయన ఒక్కరే. ఎందుకంటే… తెలుగులో అనేక సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. డ్రస్ డిజైనింగ్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ సమకూర్చేవారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో ఎక్కువ రోజులు పని చేశారు. ఆ సమయంలో ఆయన్ను ‘సురేష్’ కృష్ణ అనేవారు. ఆ తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా ఆయన పేరు స్థిరపడింది.
1980ల్లో వచ్చిన అనేక మంది అగ్ర హీరోల సినిమాలకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు. ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో కాస్ట్యూమ్స్ కృష్ణ నటుడిగా పరిచయమయ్యారు.ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్గా నటించి మెప్పించారు.ఆ తర్వాత విలన్, సహాయ పాత్రల్లో నటించారు.పెళ్లి పందిరి సహా 8 చిత్రాలకు నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు.చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి వంటి అనేక సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆయన మరణం పట్ల పలువురు సంతాపం ప్రకటించారు.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం