వారంలో మక్కా బస్సులను ఉపయోగించిన 1.9 మిలియన్ల మంది
- April 02, 2023
మక్కా: పవిత్ర రమదాన్ మాసం మొదటి వారంలో 1.9 మిలియన్లకు పైగా ప్రజలు మక్కా బస్సులను ఉపయోగించారని రాయల్ కమిషన్ ఫర్ మక్కా సిటీ అండ్ హోలీ సైట్స్ వెల్లడించింది. మక్కా బస్సుల సగటు రోజువారీ వినియోగం సుమారుగా 271,000 మంది వినియోగదారులు అని కమిషన్ పేర్కొంది. రోజువారీ ప్రయాణాల సగటు సంఖ్య సుమారుగా 4,400 ట్రిప్పుల కంటే ఎక్కువగా ఉందన్నారు. మొదటి వారంలోపు ట్రిప్పుల విషయానికొస్తే.. ఇది 12 లేన్‌ల ద్వారా 31,000 కంటే ఎక్కువ ట్రిప్పులకు చేరుకుందని తెలిపారు. ‘గెస్ట్స్ ఆఫ్ గాడ్ సర్వీస్ ప్రోగ్రామ్' కార్యక్రమాల్లో మక్కా బస్సుల ప్రాజెక్ట్ ఒకటి కావడం గమనార్హం. ఇది 438 స్టాప్ స్టేషన్లు, సెంట్రల్ ఏరియా, గ్రాండ్ మస్జీదును మక్కాలోని అనేక ముఖ్యమైన ప్రదేశాలతో కలుపుతూ 400 బస్సుల ద్వారా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







