తిరుపతి నుంచి ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు!
- April 02, 2023
తిరుపతి: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఇందు కోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోంది. ముందుగా తిరుపతి నుంచి కువైట్‌కు విమాన సర్వీసులు ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విమానయాన సంస్థలతో ఎంపీ గురుమూర్తి, ఎయిర్‌పోర్టు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.తిరుపతి నుంచి కువైట్‌కు సర్వీసులు నడపడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి సంకేతాలు వచ్చాయని తిరుపతి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్‌కిషోర్ చెప్పారు.
తిరుపతి విమానాశ్రయానికి 2017లోనే అంతర్జాతీయ విమానాశ్రయ హోదా వచ్చింది. అయితే, ఇప్పటివరకు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు.దీంతో ప్రభుత్వం అంతర్జాతీయ సర్వీసులు ప్రత్యేక దృష్టి సారించి, తిరుపతి నుంచి ప్రపంచ నగరాలకు విమానాలు నడిచేలా కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







