సొంతూరులో చంద్రబోస్‌కి ఘన సన్మానం..

- April 03, 2023 , by Maagulf
సొంతూరులో చంద్రబోస్‌కి ఘన సన్మానం..

తెలంగాణ: RRR సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ తీసుకొచ్చి సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. వీరిపై అభినందనలు కురుస్తూనే ఉన్నాయి.తాజాగా పాట రచయిత చంద్రబోస్ ఆస్కార్ తో తన సొంతూరు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగె గ్రామానికి వెళ్లారు.

దీంతో చంద్రబోస్ ని ఘనంగా ఆహ్వానించారు గ్రామస్థులు.ఊరేగించి పూలు చల్లుతూ చంద్రబోస్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.చంద్రబోస్ కి స్వాగతం చెప్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు గ్రామస్థులు. చంద్రబోస్ చదువుకున్న పాఠశాల ఆవరణలో తన స్నేహితులు, గ్రామస్థులు కలిసి చంద్రబోస్ ని ఘనంగా సన్మానించారు.ఈ నేపథ్యంలో చేతిలో ఆస్కార్ పట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు చంద్రబోస్.

సొంతూరులో సొంతవాళ్ళు చేసిన సన్మానం అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ.. విశ్వయవనికపై గెలిచిన నాటు నాటు పాట చల్లగరిగ నుడికారం, చల్లగరిగ భాష, ఇక్కడి పదాలే. పాటలో ఉపయోగించిన పదాలు ఈ గడ్డపై నేర్చుకున్నదే. పూర్తిస్థాయి ఆస్కార్ సాధించిన భారతీయ చిత్రం RRR కావడం గర్వంగా ఉంది.ఈ ఊరి లైబ్రరీలోనే నా పాటకు బీజం పడింది. నా చల్లగరిగ ప్రపంచాన్ని గెలిచింది. శిథిలావస్థకు చేరిన ఈ ఊరి లైబ్రరీని నా కష్టార్జితంతో పునర్నిర్మిస్తాను.దానికి ఆస్కార్ గ్రంథాలయం అని పేరు పెడతాను అని అన్నారు.అనంతరం నాటు నాటు పాట స్వయంగా పాడి ఊరును ఉర్రూతలూగించారు చంద్రబోస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com