యూఏఈ ట్రావెల్ అలెర్ట్: మార్బర్గ్ వైరస్ ఎంత ప్రమాదకరమైంది?
- April 03, 2023
యూఏఈ: పౌరులు, నివాసితులకు యూఏఈ ప్రయాణ సలహాను జారీ చేసింది. మార్బర్గ్ వైరస్ వ్యాప్తి కారణంగా ఈక్వటోరియల్ గినియా, టాంజానియాకు ప్రయాణించవద్దని సూచించింది. ఈ రెండు ఆఫ్రికన్ దేశాలకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ పౌరులు, నివాసితులను కోరింది. ప్రయాణం తప్పనిసరి అయితే రెండు దేశాలలో నివసిస్తున్న లేదా సందర్శించే పౌరులు జాగ్రత్తలు తీసుకోవాలని, సమర్థ అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను పాటించాలని పిలుపునిచ్చారు.
ఈక్వటోరియల్ గినియా, టాంజానియాలలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇది ఎబోలా మాదిరిగానే అత్యంత అంటు, ప్రాణాంతక వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. మార్బర్గ్ వైరస్ వ్యాధి అనేది వైరల్ హెమరేజిక్ జ్వరం. ఇది WHO ప్రకారం 88% వరకు మరణాల రేటును కలిగి ఉంది. వైరస్ తీవ్రమైన జ్వరాన్ని కలిగిస్తుందని, తీవ్ర రక్తస్రావం, అవయవ వైఫల్యంతో కూడి ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వీటితోపాటు తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, అతిసారం, కడుపు నొప్పి, వికారం-వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించింది.
మార్బర్గ్ పండ్ల గబ్బిలాల నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. ప్రాణాంతక ఎబోలా వ్యాధికి కారణమైన అదే వైరస్ కుటుంబానికి ఇదికూడా చెందినదని నిపుణులు తెలిపారు. ఇది గబ్బిలాలు నివసించే గుహలు, గనులలో ఎక్కువ కాలం గడిపిన వ్యక్తుల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం వ్యాక్సిన్లు లేదా యాంటీవైరల్ చికిత్సలు అందుబాటులో లేవు. అయితే రక్త ఉత్పత్తులు, రోగనిరోధక చికిత్సలు, డ్రగ్ థెరపీలతో సహా ముందస్తు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్బర్గ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఈక్వటోరియల్ గినియా, ఘనా, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో, కెన్యా, దక్షిణ ఆఫ్రికా, ఉగాండా, జింబాబ్వే దేశాల్లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







