ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్
- April 04, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం మార్చి 31న నిర్వహించిన ఓపెన్ హౌస్ సక్సెస్ అయింది. బహ్రెయిన్ రాజ్యంలోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో దాదాపు 70 మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబాసిడర్ శ్రీవాస్తవ ప్రతి ఒక్కరికీ పవిత్ర రమదాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. మార్చి నెలలో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం 146వ IPU అసెంబ్లీకి హాజరయ్యారని, అలాగే రెండు మంత్రుల స్థాయి బృందాలు బహ్రెయిన్ లో పర్యటించారని గుర్తుచేశారు. భారత్, బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల సానుకూల పథం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ICWF ద్వారా అవసరమైన వ్యక్తులకు అత్యవసర ధృవీకరణ పత్రాలు, టిక్కెట్లను మంజూరు, బోర్డింగ్, వసతిని అందించడం ద్వారా భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేయడం కొనసాగిస్తుందన్నారు. ఇదే క్రమంలో ఇటీవల దొంగా కన్నమ్మ, రాజన్ ముంగి లకు ICWF ద్వారా విమాన టిక్కెట్లు అందించడంతో వారు భారతదేశానికి తిరిగి వెళ్లారని పేర్కొన్నారు. కాన్సులర్, కమ్యూనిటీ సంక్షేమ విషయాలకు సంబంధించి సత్వర మద్దతు, చర్య కోసం కార్మిక మంత్రిత్వ శాఖ, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), ఇమ్మిగ్రేషన్ అధికారులతో సహా బహ్రెయిన్ ప్రభుత్వ అధికారులకు రాయబారి శ్రీవాస్తవ ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







