సౌదీకరణ మరిన్ని రంగాలకు విస్తరణ

- April 04, 2023 , by Maagulf
సౌదీకరణ మరిన్ని రంగాలకు విస్తరణ

రియాద్: మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRSD) సౌదైజేషన్ డ్రైవ్‌ను కొత్త వృత్తులు, రంగాలకు విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో ప్రాజెక్ట్ నిర్వహణ, సేకరణ – అమ్మకాలు, షిప్పింగ్ కార్యకలాపాలు, సరుకు రవాణా బ్రోకరేజ్ సేవలను అందించే అవుట్‌లెట్‌లు, డెకర్ - మహిళల టైలరింగ్ కోసం అవుట్‌లెట్‌లు ఉన్నాయి. సౌదీ యువకులకు, మహిళలకు మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు చేపట్టిన సౌదైజేషన్ డ్రైవ్ అమలులో వివిధ దశల్లో ఉందని MHRSD తెలిపింది. మునిసిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ తదితర శాఖల సహకారంతో రెండు దశల్లో ఆయా రంగంలో సౌదీకరణ అమలు చేయబడుతుందన్నారు. ప్రైవేట్ రంగ సంస్థలకు మద్దతు ఇవ్వడానికి, సౌదీలను నియమించుకోవడంలో వారికి సహాయపడటానికి ప్రోత్సాహకాల ప్యాకేజీని అందజేస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  అలాగే సౌదైజేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్‌ల నుండి అలాగే మానవ వనరుల అభివృద్ధి నిధి (HADAF)  నుండి ప్రయోజనం పొందవచ్చని తెలిపింది. వృత్తులు, కార్యకలాపాల స్థానికీకరణ, వాటి అమలుకు సంబంధించిన యంత్రాంగాల వివరాలను వివరించే విధానపరమైన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ జారీ చేసింది. వీటిని ఉల్లంఘించిన వారిపై చట్టబద్ధమైన జరిమానాలను విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ ప్రైవేట్ సంస్థలను హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com