పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్..

- April 05, 2023 , by Maagulf
పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్..

హైదరాబాద్:  తెలంగాణలో పదో తరగతి తెలుగు, హిందీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ కావడం రాజకీయంగానూ కలకలం రేపుతోంది. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసి పలు ప్రాంతాల్లో తిప్పుతున్న విషయం తెలిసిందే. జనగాం జిల్లా పాలకుర్తిలో బండి సంజయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు.

బండి సంజయ్ పై ఐటీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మాల్‌ ప్రాక్టీస్‌ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసు రిమాండు ద్వారా కీలక విషయాలు తెలిశాయి. లీకేజీ కేసులో బండి సంజయ్ ను ఏ1గా పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్ పేర్లను నమోదు చేశారు. బండి సంజయ్ పై రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం బండి సంజయ్ ను పోలీసులు హనుమకొండ కోర్టుకు తీసుకెళ్లారు.

దీంతో ఆ కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు వద్ద పోలీసులు, లాయర్లకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కోర్టు ప్రాంగణం గేటుకు పోలీసులు తాళాలు వేయడంతో గొడవ చెలరేగింది. తమను లోపలికి వెళ్లనివ్వాలని లాయర్లు డిమాండ్ చేశారు.

మరోవైపు, బండి సంజయ్ ను పోలీసులు తీసుకెళ్తున్న వాహనం పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో కాసేపు రోడ్డుపై ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో పదో తరగతి తెలుగు పేపర్ లీక్ కావడం వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com