జపాన్‌లో చిట్టిబాబు మేనియా.!
- April 05, 2023
‘ఆర్ఆర్ఆర్’ సినిమాని జపాన్‌లో రిలీజ్ చేసి మంచి ఫలితాలు అందుకున్నారు. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమా జపాన్‌లో సునామీ సృష్టించడానికి సిద్దమవుతోంది. అదే ‘రంగస్థలం’ సినిమా. ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ర్టాలతో పాటూ, అమెరికాలోనూ సంచలనాలు సృష్టించింది.
ఇక ఇప్పుడు జపాన్‌లో తన సత్తా చాటబోతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్‌కి పిచ్చ పిచ్చగా క్రేజ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్‌తోనే జపాన్‌లో ఓ ప్రముఖ డిస్ర్టిబ్యూషన్ సంస్థ ‘రంగస్థలం’ సినిమాని స్ట్రీమింగ్ చేసేందుకు ముందుకొచ్చింది.
ఈ నెల 9,10,11 తేదీల్లో ‘రంగస్థలం’ సినిమా జపాన్‌లో స్ర్టీమింగ్ కానుంది. రామ్ చరన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’ మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది. జపాన్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







